మురికినీటిని నిల్వ ఉండనీయొద్దు

ఫ్రై డే డ్రై డే సందర్భంగా కలెక్టర్​ రాజర్షి షా

Sep 27, 2024 - 20:43
 0
మురికినీటిని నిల్వ ఉండనీయొద్దు

నా తెలంగాణ, ఆదిలాబాద్: అనారోగ్యాన్ని దరిచేర్చే మురికి నీటిని పరిసరాలు, ఇళ్ల ఆవరణల్లో ఉండనీయొద్దని జిల్లా కలెక్టర్​ రాజర్షి షా అన్నారు. ఫ్రైడే డ్రై డే సందర్భంగా శుక్రవారం ఆంకోలి గ్రామంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఇంటి పరిసరాల్లో ఉన్న కుండీలు, డ్రమ్ములు, వాడుకలో  లేని వస్తువులలో ఉండే నీరు వల్ల దోమలు, ఈగలు చేరి అనారోగ్యానికి గురిచేస్తాయని, అటువంటి వాటిలో నీటిని తొలగించాలని అన్నారు. అనంతరం గ్రామ పంచాయితీ కార్యాలయం సందర్శించి తుది ఓటరు జాబితాను పరిశీలించారు. అంగన్​ వాడీ  కేంద్రంలో చిన్నారులతో భోజనం చేశారు. స్వచ్ఛత హీ సేవాలో భాగంగా అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటి ఆసుపత్రిని సందర్శించారు. కలెక్టర్​ వెంట పర్యటనలో ప్రత్యేక అధికారి పద్మభూషణ్,  డీఆర్డీవో సాయన్న, డీఎల్​ పీవో ఫణీంద్ర, ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి, వైద్యాధికారులు తదితరులు ఉన్నారు.