ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

మెదక్​ చర్చిని సందర్శించిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్​

Sep 27, 2024 - 20:45
 0
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
 నా తెలంగాణ, మెదక్: భగవంతుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ప్రార్థించారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ కెతిడ్రల్ చర్చి 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా మెదక్ కెతిడ్రల్ చర్చి పెద్దలు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 79వ చర్చి వార్షికోత్సవంలో పాల్గోనడం సంతోషకరంగా ఉందన్నారు. 
 
ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్, కౌన్సిలర్ దాయర లింగం, దొంతి లక్ష్మి ముత్యం గౌడ్, ప్రవీణ్ గౌడ్, బొజ్జ పవన్, రాగి అశోక్, సమీ, ఎస్.డి. క్రిష్ణ, పోచేందర్, శ్రీనివాస్ చౌదరి, పేరూరి శంకర్, బాని, మందుగుల గంగాధర్, సంగమేశ్వర్, సంపత్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
 
త్యాగానికి ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ..
బలహీనవర్గాల ఆత్మగౌరవానికి, త్యాగానికి ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజి అని మైనంపల్లి రోహిత్ అన్నారు. పట్టణంలోని స్థానిక రాందాస్ చౌరస్తాలో ఆయన జయంతిని పురస్కరించుకోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.