లడ్డూ వివాదం రాజకీయం చేయొద్దు సుప్రీం
Do not politicize the Laddu controversy Supreme
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: లడ్డూ వివాదంలో దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుపతి లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం సోమవారం విచారించింది. జస్టిస్ భూషన్ ఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసం పిటిషన్ పై విచారణ చేపట్టింది. సీఎం చేసిన ఆరోపణలపై సుప్రీంలో టీటీడీ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్, ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీలు సుప్రీంలో వాదనలు వినిపించారు. రోహిత్గీ అడిగిన ప్రశ్నకు జవాబుగా న్యాయమూర్తి గవాయ్ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారు దేవుళ్లను రాజకీయాలకు దూరం ఉంచాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే సెట్ విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై మీడియాలో ప్రచారాలకు అవసరం ఏమిటని? ప్రశ్నించింది. గత ప్రభుత్వం తమ ప్రభుత్వంపై అవాస్తవాలతో కూడిన పిటిషన్లను వేసిందని రోహిత్గీ ఆరోపించారు.