ధారవిలో మసీదు అక్రమ నిర్మాణం కూల్చివేత

Demolition of illegal construction of mosque in Dharavi

Sep 30, 2024 - 14:09
 0
ధారవిలో మసీదు అక్రమ నిర్మాణం కూల్చివేత

ముంబాయి: ఎట్టకేలకు ముంబాయిలోని ధారవిలో మెహబూబ్​ ఎ సుభానియా మసీదులో అక్రమ కట్టడాన్ని మసీదు కమిటీయే కూల్చివేస్తోంది. సోమవారం ఇంజనీర్ల పర్యవేక్షణలో మసీదు కమిటీ హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చివేత ప్రక్రియను మొదలు పెట్టింది. తొలుతగా మసీదుపై ఉన్న ప్రాకారాన్ని కూల్చనున్నారు. ఆ తరువాత ఇతర అక్రమణలుగా ఆరోపించబడుతున్న స్థలంలోని నిర్మాణాలను కూడా కూల్చనున్నారు. 

ఐదురోజుల్లోగా మసీదు అక్రమ కట్టడంపై మీరు చర్యలు తీసుకోకుంటే తామే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సోమవారానికి హైకోర్టు ఇచ్చిన గడువు ముగియనుంది. దీంతో మసీదు కమిటీ కూల్చివేత చర్యలు చేపట్టింది.