భవిష్యత్​ కు బంగారు బాటలు

Golden paths to the future

Dec 11, 2024 - 18:03
 0
భవిష్యత్​ కు బంగారు బాటలు

యువ ఆవిష్కర్తలే కీలక పాత్ర
స్మార్ట్​ ఇండియా హ్యాకథాన్​ లో ప్రధాని మోదీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారతదేశ భవిష్యత్​ కు బంగారు బాటలు వేయడంలో యువ ఆవిష్కర్తల పాత్ర కీలకం కాగలదని, దీంతో లక్షలాది మంది జీవితాలలో మార్పు వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సైబర్​ ముప్పు పెరుగుదల పట్ల బుధవారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్​ మాధ్యమంగా స్మార్ట్​ ఇండియా హ్యాకథాన్​ 2024 గ్రాండ్​ ఫినాలే యువ ఆవిష్కర్తల ఇంటరాక్షన్​ లో మాట్లాడారు. ప్రపంచంలోని డిజిటల్​ ఆర్థిక వ్యవస్థల్లో అగ్రగామిగా నిలుస్తున్న ఆర్థిక వ్యవస్థ భారత్​ అన్నారు. ఇందులో యువ ఆవిష్కర్తల పాత్రను ప్రశంసించారు. 21వ శతాబ్దంలో యువత భిన్నమైన దృక్పథానికి వారి ఆలోచనలు, పనితీరే నిదర్శనమన్నారు. 

కొత్త విషయాలు నేర్చుకుంటా..
సమిష్టి కృషితోనే భారతదేశం శరవేగంగా ముందుకు సాగుతుందని మోదీ పునరుద్ఘాటించారు. యువ ఆవిష్కర్తలతో సన్నిహితంగా ఉంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చాలా కొత్త విషయాలను నేర్చుకుంటానని, అర్థం చేసుకుంటానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశం కొత్త సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు, యువ ఆవిష్కర్తలు అసాధారణ పరిష్కారాలతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. యువ ఆవిష్కర్తలు సమస్యల పరిష్​కారంలో ఎప్పుడు వెనుకడుగు వేయలేదన్నారు. దేశాన్ని నిరాశపర్చలేదన్నారు. వారి మనోధైర్యం గొప్పదన్నారు. 

ఆవిష్కరణలను ప్రభుత్వ శాఖలు ఉపయోగించుకుంటున్నాయి..
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ద్వారా సమస్యలకు పరిష్కారాలను ఇప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు కూడా ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా యువ ఆవిష్కర్తల ఫలితాలు గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయని ప్రధాని తెలిపారు. ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని ప్రతీఒక్కరూ అర్హులేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో ఏ ఒక్కరూ వెనుకబడి ఉండొద్దనేదే తమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఆశయాలను సాధించేందుకు పట్టుదల, వినూత్న ఆవిష్కరణలు మరిన్ని అవసరమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. 

డెలివరీ సేవల్లో డ్రోన్​ లు కీలకం.. 
దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో డ్రోన్‌లు విస్తృతంగా ఉపయోగిస్తున్న విషయాన్ని ప్రధాని మోదీ హైలైట్ చేశారు. నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రస్తావించారు. సుదూర ప్రాంతాలకు మందులు, నిత్యావసర వస్తువులను డెలివరీ చేయడానికి ఇప్పుడు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారని మోదీ హర్షం వ్యక్తం చేశారు.