33 సూర్యులు పట్టేంత బ్లాక్​ హోల్​ ‘గియా–బీహెచ్​–3’గా నామకరణం

వివరాలు వెల్లడించిన ఖగోళ శాస్త్రవేత్త పాస్​ క్వెల్​ పనుజో

Apr 17, 2024 - 12:29
 0
33 సూర్యులు పట్టేంత బ్లాక్​ హోల్​ ‘గియా–బీహెచ్​–3’గా నామకరణం

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: అంతరిక్షంలోని అతిపెద్ద బ్లాక్​ హోల్​ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ బ్లాక్​ హోల్​ అతిపెద్దదన్నారు. దీనికి ‘గియా–బీహెచ్​–3’ అని పేరు పెట్టారు.ఈ బ్లాక్​ హోల్​ లో 33 సూర్యులు పట్టేంత స్థలం ఉందన్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గియా మిషన్ ద్వారా సేకరించిన డేటా నుండి  ఈ బ్లాక్​ హోల్​ ను గుర్తించినట్లు అబ్జర్వేటోయిర్ డి పారిస్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఖగోళ శాస్త్రవేత్త పాస్‌క్వెల్ పనుజో బుధవారం వివరించారు.  గియా భూమికి రెండు వేల కాంతి సంవత్సరాల దూరంలో అక్విలా రాశిలో బీహెచ్​–3 ఉందని స్పష్టం చేశారు. 

గియా టెలిస్కోప్ ఆకాశంలో నక్షత్రాల ఖచ్చితమైన స్థానాలను అందిస్తుంది. దీని ఆధారంగా పాలపుంతులు, నక్షత్రాలు, తోక చుక్కలు, ఉల్కలు, ఇతర గ్రహాల దూరాలను, భారాలను, కక్ష్యలను ఖచ్చితంగా అంచనా వేయగలరు. దీని ద్వారానే గయా –బీహెచ్​–3 33 సూర్యులు పట్టేటంత పెద్దదని అంచనా వేసినట్లు పనుజో తెలిపారు. టెలిస్కోప్​ సహయంతో దీని నిశిత పరిశీలన అనంతరం ఇది బ్లాక్​ హోల్​ అని నిర్ధారించుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే గెలాక్సీలో ఉన్న బ్లాక్​ హోల్​ ల కంటే ఇది అత్యంత పెద్దదని స్పష్టం చేశారు. 

గియా టెలిస్కోప్ 10 సంవత్సరాలుగా భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో పనిచేస్తోంది. 2022లో 1.8 బిలియన్ కంటే ఎక్కువ నక్షత్రాల స్థానాలు, వాటి కదలికల 3డీ మ్యాప్​ ను కూడా పంపించింది.