సంభాల్ హింస హైకోర్టును ఆశ్రయించిన ఎస్పీ ఎంపీ బుర్కే
SP MP Burke approached the High Court for Sambhal violence
లక్నో: యూపీలోని సంభాల్ హింసలో తన ప్రమేయం లేదని అరెస్ట్ ను తప్పించాలని ఎస్పీ ఎంపీ జియావుద్దీన్ బుర్కే బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. కేసును రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తాను చదువుకున్న ఎంపీనని పేర్కొన్నారు. అరెస్టుపై స్టే విధించి, కేసులను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా పోలీసులు బుర్కే 24న సంభాల్ మసీదులో ప్రసంగం తరువాత అల్లర్లు చెలరేగాయని ఆరోపించారు. ముస్లింలను రెచ్చగొట్టడంతోనే హింస చెలరేగిందన్నారు. ఈ హింసలో ఐదుగురు మృతిచెందగా, 24 మంది సామాన్యులకు, 20 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. ఈ కేసులో ఎంపీ ప్రధాన నిందితుడన్నారు. పోలీసులు బుర్కేపై మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు.