వార్త బయటికి పొక్కడంతో ఇస్మాయిల్ కు గుండెపోటు?
దిగ్ర్భాంతికి గురైన సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ
నస్రుల్లా, పేజర్, వాకీటాకీ దాడుల్లో ఇతని ప్రమేయంపై ఇరాన్ ఆర్మీ విచారణ?
టెహ్రాన్: ఇజ్రాయెల్ కు గూఢచారిగా ఇరాన్ ఆర్మీ చీఫ్ ఇస్మాయిల్ కాని వ్యవహరిస్తున్నారనే అనుమానం ఆ దేశంలో కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం ఈ వార్త కాస్త బయటికి పొక్కడంతో ఆర్మీ చీఫ్ కు గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేరారు. అయితే గూఢచర్యంపై ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ (దర్యాప్తు సంస్థ) ఎలాంటి విషయాలను బయట పెట్టడం లేదు. ఆర్మీ చీఫ్ ఇస్మాయిల్ ను ఈ దిశలో విచారించినట్లుగా తెలుస్తోంది. ఈ వార్త బయటికి పొక్కడంతో సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని కూడా తీవ్ర దిగ్ర్బాంతికి గురి చేసింది. ఇంత పకడ్భందీ విచారణ సమాచారం బయటికెలా పొక్కిందనేదానిపై విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇస్లాయిల్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఇరాన్ ఆర్మీ విషయాలను బయటికి పొక్కనీయడం లేదు.
నస్రుల్లాపై దాడి, హిజ్బుల్లా నాయకులపై వరుస దాడుల్లో ఈయన హస్తం ఉన్నట్లు ఇరాన్ అనుమానిస్తోంది. అయితే ఇటీవల ఐడీఎఫ్ జరిపిన బంకర్ పేలుడులో ఇస్మాయిల్ కాని మృతి చెందారనే ప్రచారం కూడా జరుగుతోంది. లెబనాన్ లో పేజర్, వాకీటాకీ దాడుల్లో కూడా ఇతని ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఇరాన్ ఆర్మీ ఈ వార్తలను ఖండించింది. ప్రతీ ఒక్క అంశాన్ని తాము దర్యాప్తు చేస్తున్నట్లు మాత్రమే వెల్లడించింది. ఏయే అంశాల దర్యాప్తు అన్నది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.