యువతకు క్రీడా కిట్ల పంపిణీ

Distribution of sports kits to youth

Jun 15, 2024 - 20:16
 0
యువతకు క్రీడా కిట్ల పంపిణీ

నా తెలంగాణ, చెన్నూర్: యువత విద్యతో పాటు క్రీడాల్లోనూ రాణించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం కోటపల్లి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామ యువకులకు క్రీడా కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస అవ్వకుండా, చెడు మార్గంలోకి వెళ్లకుండా, మానసిక ఉల్లాసనికి ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. గ్రామంలోని యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై పోలీసుల నిఘా ఉంటుందని, యువకులు కూడా తమ గ్రామంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల గురించి పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ శ్రీనివాస్ లు పేర్కొన్నారు.