డార్జిలింగ్​ లో ఘోర రైలు ప్రమాదం 9మంది మృతి

41మందికి గాయాలు, కాంచనజంగాను ఢీకొన్న గూడ్స్​ సిగ్నల్​ పట్టించుకోకపోవడంతోనే ప్రమాదం? కొనసాగుతున్న రెస్క్యూ చర్యలు సంఘటనా స్థలానికి బయలుదేరిన మంత్రి అశ్విని వైష్ణవ్​

Jun 17, 2024 - 12:23
Jun 17, 2024 - 21:24
 0
డార్జిలింగ్​ లో ఘోర రైలు ప్రమాదం 9మంది మృతి

కోల్​ కతా: డార్జిలింగ్​ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9మంది మృతిచెందగా, 41 మంది వరకు గాయాలైనట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ (13174)ని వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు కోచ్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

అగర్తల నుంచి పశ్చిమ బెంగాల్‌లోని సీల్దాకు కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ వెళ్తోంది. రెడ్ సిగ్నల్ కారణంగా సిలిగురిలోని రంగపాణి స్టేషన్ సమీపంలోని రుయిదాసా వద్ద ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేశారు. ఇంతలో వెనుక నుంచి వచ్చిన గూడ్స్ రైలు దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లోకో పైలట్‌ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. 

గూడ్స్ రైలు పైలట్ సిగ్నల్ పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. గూడ్స్​ ఢీ కొనడంతో ఢీకొనడం వల్ల ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్ గూడ్స్ రైలు ఇంజిన్‌ పై పడింది. మరో రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రమాదంపై సహాయక చర్యల్లో వేగం పెంచేందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ డార్జిలింగ్‌కు బయలుదేరి వెళ్లారు.