ఇన్విటేషన్​ కార్డుతో ఓటర్లకు ఆహ్వానం!

Invitation to voters with an invitation card!

Apr 26, 2024 - 09:01
 0
ఇన్విటేషన్​ కార్డుతో ఓటర్లకు ఆహ్వానం!

లక్నో: యూపీలోని 8 స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్​ నిర్వహిస్తున్నారు. 18వ లోక్​ సభ ఎన్నికల కోసం ఈసీ వినూత్న ఐడియాతో ఓటర్లను ఆకర్షించింది. ఓటర్లను ఆహ్వానిస్తూ పెళ్లి కార్డు రూపొందించింది. ఈ కార్డుకు ఓటరు ఇన్విటేషన్​ కార్డుగా నామకరణం చేయడం విశేషం. 

ప్రియమైన ఓటరులారా భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం శుక్రవారం (ఏప్రిల్​–26) రెండోవిడత లోక్ సభ ఎన్నికలు మంగళ్ ఉత్సవ్ సమయంలో నిర్వహిస్తున్నామని కార్డులో పేర్కొన్నారు. ఈ శుభకార్యంలో ఓటుహక్కు ఉన్న ప్రతీ ఒక్కరూ అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆహ్వానం ఫలించి శుక్రవారం ఉదయం నుంచే పెద్ద యెత్తున ఆ ప్రాంతంలో ఓటింగ్​ కొనసాగుతుండడం విశేషం.