రఫాపై బీకర దాడులు భారీ ఎత్తున సురక్షిత ప్రాంతాలకు ప్రజలు

భేషరతుగా బందీలను విడుదల హమాస్​ నాయకుల అంతమే లక్ష్యమంటున్న ఇజ్రాయెల్​ నెతన్యాహు చర్యలపై అంతర్జాయంగా తీవ్ర ఆగ్రహావేశాలు

May 11, 2024 - 14:52
 0
రఫాపై బీకర దాడులు భారీ ఎత్తున సురక్షిత ప్రాంతాలకు ప్రజలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ ఒత్తిళ్లను నెతన్యాహు ఏ మాత్రం లెక్కచేయడం లేదు. రఫాపై దాడులను కొనసాగించాలని ఐడీఎఫ్​ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో హమాస్​ – ఐడీఎఫ్​ మధ్య బీకర పోరు శనివారం వేకువజాము నుంచే ప్రారంభమైంది. పేరుకు చిన్నస్థాయిల్లో దాడులు కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్​ భారీ ఎత్తున దాడులకు పాల్పడుతుండడంతో కలవరం రేగుతోంది. తూర్పు, పశ్చిమ రఫాను దారిలో భారీ ఎత్తున ఇజ్రాయెల్​ యుద్ధ ట్యాంకులు మోహరించి రాకెట్​ లాంచర్లను ప్రయోగిస్తోంది. దీంతో రఫాలో ఉంటున్న ప్రజలు భారీ ఎత్తున అక్కడి నుంచి పిల్లాపాపలతో తరలివెళుతున్నారు. ఇజ్రాయెల్​ హెచ్చరికలతో ఇప్పటికే లక్షలాది మంది రఫాను విడిపెట్టారు. దాడులు ప్రారంభం కావడంతో రఫాను వీడుతున్న వరి సంఖ్య భారీగా పెరిగింది. కాగా దాడులపై ఐక్యరాజ్య సమితి, అమెరికాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే రఫాలోనే హమాస్​ కు చెందిన కీలక నేతలు దాగి ఉన్నారని ఐడీఎఫ్​ చెబుతోంది. వీరందరినీ తుదముట్టించే వరకు, తమ దేశ పౌరులను భేషరతుగా విడుదల చేసే వరకు వారిని వదిలేది లేదని స్పష్టం చేసింది. 

మరోవైపు అంతర్జాతీయ సహాయక సంస్థ రెడ్​ క్రాస్​ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.