ట్రంప్ గెలుపుతో నిరాశ.. నాలుగేళ్లు ప్రయాణం!
Disappointment with Trump's victory.. Four years journey!
విల్లా/రెసిడెన్స్ క్రూయిజ్ సిద్ధం
ప్యాకేజీ వెల్లడించిన సంస్థ సీఈవో
400 ప్రదేశాలలో నాలుగేళ్లపాటు ప్రయాణం
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ గెలుపుతో నిరాశలో ఉన్న డెమోక్రాట్లు నాలుగేళ్లపాటు ప్రపంచ పర్యటనకు ఓ సంస్థ ప్యాకేజీని ప్రకటించి ఆశ్చర్యపరుస్తోంది! విల్లా వర్సెస్ రెసిడెన్స్ అనే ఫ్లోరిడాకు చెందిన క్రూయిజ్ సంస్థ ఈ ఆఫర్ ను ప్రకటించింది. ఆఫర్ లో భాగంగా 400 గమ్యస్థానాలలో పర్యటించే ప్యాకేజీని విడుదల చేసింది. ఈ సంస్థ తరచూ ఇలాంటి ప్యాకేజీలకు పంపిస్తుంది. ఈ ప్యాకేజీలో 400 ప్రదేశాలలో నాలుగేళ్లపాటు ప్రపంచాన్ని చుట్టి రానుంది. సంస్థ సీఈవో మైఖేల్ పీటర్సన్ మాట్లాడుతూ.. తమ ఓడలో ప్రయాణం భిన్నంగా ఉంటుందన్నారు. ప్రజలు తమ బాధలను మరిచి మంచి వాతావరణాన్ని ఆస్వాదిస్తారన్నారు. ఈ ప్రయాణంలో నాలుగు ప్యాకేజీలను కూడా ప్రకటించింది. 1, 2, 3, 4యేళ్లపాటు ఈ ప్రయాణాలు కొనసాగిస్తామని దీన్నే స్కిప్ ఫార్వర్డ్ ప్యాకేజీగా పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ ప్యాకేజీ ఖరీదు యేడాదికి 40వేల యూఎస్ డాలర్లు. అయితే నాలుగేళ్లపాటు ఈ క్రూయిజ్ షిప్ లో ప్రయాణించాలంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1,35,03,760 ఖర్చవుతుంది. అసలే వలసలపై మండిపడుతున్న ట్రంప్ ఈ ప్యాకేజీని విని తనకు ఓటు వేయని వారినంతా సముద్రంలో ముంచినా ముంచే ప్రమాదం లేకపోలేదని పలువురు నెటీజన్లు సోషల్ మాధ్యమంగా విమర్శలు చేస్తుండడం గమనార్హం. ఏది ఏమైనా ఈ క్రూయిజ్ సంస్థ పెద్ద సాహసమే చేస్తుందని చెప్పొచ్చు.