డ్రోన్​ ల ఉత్పత్తిలో 28 శాతం వార్షిక వృద్ధి

దేశీయ సంస్థలకు ఊతం, ఉపాధి కల్పనకు మార్గం సుగమం రక్షణ రంగ సంస్థలు బలోపేతం ఆర్థిక రంగంలో స్వావలంభన దిశగా భారత్​

Jul 18, 2024 - 18:13
 0
డ్రోన్​ ల ఉత్పత్తిలో 28 శాతం వార్షిక వృద్ధి

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: రానున్న ఐదేళ్లలో భారత్​ డ్రోన్​ ఉత్పత్తులు, ఎగుమతులలో 28 శాతం వార్షిక వృద్ధిని సాధిస్తుందని మోతీలా ఓస్వాల్​ (ఆర్థిక సేవల సంస్థ) నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించారు. రాబోయే సమయంలో వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు డ్రోన్​ లు కీలక పాత్ర వహించనున్నాయని పేర్కొన్నారు. 

కౌంటర్​ డ్రోన్​ ల మార్కెట్​ రూ. 120 బిలియన్లు (1.6 డాలర్ల బిలియన్లు)గా ఉంటుందని అంచనా వేశారు. ఇందుకు 1200 అత్యాధునిక కౌంటర్​ డ్రోన్​ లు అవసరం అవుతాయన్నారు. మార్కెట్​ లో ఒక్కో డ్రోన్​ ధర రూ. 80 నుంచి రూ. 15‌‌0 మిలియన్ల మధ్య ఉండొచ్చన్నారు. ఇది భారత్​ కు రూ. 24 బిలియనల వార్షిక మార్కెట్​ అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. 

ప్రతీ డ్రోన్​ కు పదేళ్ల జీవితకాలం ఉంటుందని స్పష్టం చేశారు. భారత్​ లోని విస్తృత రక్షణ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ కూడా గణనీయమైన వృద్ధి సాధిస్తుందన్నారు. 2021లో 1.9 బిలియన్​ డాలర్ల నుంచి 2030 నాటికి 7 బిలియన్​ డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు. 

డ్రోన్ల తయారీ వల్ల అనేక సంస్థలు, రంగాలు బలోపేతం అవడమే గాక, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుడతాయని, దీని ద్వారా దేశీయంగా దిగుమతులు తగ్గి, ఎగుమతులు గణనీయంగా పెరుగనున్నాయి. దీంతో భారత రక్షణ, వైమానిక, నేవీ రంగాల బలోపేతంతోపాటు ఎగుమతుల ద్వారా భారత్​ ఆర్థిక వృద్ధిలో స్వావలంభన చోటు చేసుకుందని ఆ నివేదికలో పేర్కొన్నారు.