కార్యకర్తలకు శిరస్సువంచి మోదీ నమస్కారం

Modi salutations to the activists

Jun 7, 2024 - 13:46
 0
కార్యకర్తలకు శిరస్సువంచి మోదీ నమస్కారం

నా తెలంగాణ, ఢిల్లీ: ఎన్డీయే పక్షాల విజయానికి కీలక భూమిక పోషించింది లక్షలాది మంది కార్యకర్తలేనని వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం పార్లమెంట్​ హౌస్​ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. తనను ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్నందుకు 13 పార్టీల అధినేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇంత పెద్ద సమూహం ఈరోజు నాకు స్వాగతం పలికే అవకాశం రావడం సంతోషకరమైన విషయం అన్నారు. తనను ఎన్‌డిఎ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా నాకు కొత్త బాధ్యత అప్పగించడం నా అదృష్టమని, తనపై దేశ ప్రజలు, ఎన్డీయే పక్షాలు నమ్మకం, విశ్వాసంతో ఆ బాధ్యతను నిలుపుకుంటానని అన్నారు.