జమ్మూకశ్మీర్​ లో 119మంది ఉగ్రవాదులు

119 terrorists in Jammu and Kashmir

Nov 13, 2024 - 15:28
 0
జమ్మూకశ్మీర్​ లో 119మంది ఉగ్రవాదులు

95మంది పాక్​ కు చెందినవారు
శిక్షణ, వేతనాలిచ్చి పంపుతున్న పాక్​ ఐఎస్​ ఐ
నిఘావర్గాలకు కీలక సమాచారం

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: పాక్​ తన వక్రబుద్ధిని వీడడం లేదు. తమ దేశంలోని అత్యంత బీదరికంలో మగ్గుతున్న యువకులను ఉగ్రవాదం మళ్లించే కుట్రలకు తెరలేపుతూ.. వారికి శిక్షణనిచ్చి నెలకు రూ. 15వేల రూ. 20వేల వరకూ వేతనాలిస్తూ తుపాకులిచ్చి మరీ జమ్మూకశ్మీర్​ లోకి పంపుతున్నట్లు ఇంటలిజెన్స్​ వర్గాలు గుర్తించాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు ఇంకా జమ్మూకశ్మీర్​ లో 119 మంది ఉగ్రవాదులు ఉన్నారని స్పష్టం చేశాయి. 2024లో 61 మంది ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఇంకా రాష్​ర్టంలోనే పలు ప్రాంతాల్లో క్రియాశీలకంగా ఈ ఉగ్రవాదులు ఏదో ఒక చోట ఉన్నారని స్పష్టం చేశాయి. కశ్మీర్​ లో 79మంది, జమ్మూలో 40 మందిని పాక్​ పంపినట్లుగా గుర్తించాయి. వీరిలో 95 మంది పాక్​ కు చెందిన వారు కాగా 24 మంది స్థానికులని ఇంటలిజెన్స్​ వర్గాల ద్వారా సమాచారం. కశ్మీర్​ లో 61, జమ్మూలో 34 పాక్​ ఉగ్రవాదులున్నట్లు స్పష్టం చేసింది. ఎల్వోసీ కశ్మీర్​ నుంచి 343.9 కిలోమీటర్లు, జమ్మూ నుంచి 224.5 కిలోమీటర్లు ఉంటుంది.