వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి

వంద రోజుల లక్ష్యం పూర్తి కేంద్రప్రభుత్వం చర్యలను కొనియాడిన అధికారులు

Sep 21, 2024 - 20:52
 0
వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వన్యప్రాణుల ఆవాసాల సమగ్ర అభివృద్ధికి నిర్దేశించిన వందరోజుల లక్ష్​యాన్ని సాధించామని పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. శనివారం ఆ శాఖ ఆధ్వర్యంలో లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల వల్ల వన్యప్రాణుల పెరుగుదల నమోదవుతుందన్నారు. అదే సమయంలో కేంద్రమంత్రి వర్గం రూ. 2600 కోట్లతో వన్యప్రాణి నివాస అభివృద్ధి పథకం కూడా సహాయకారిగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 55 టైగర్​ రిజర్వ్​ లు, 33 ఎలిఫెంట్ రిజర్వ్​ లు, 718 సురక్షిత ప్రాంతాలలో సురక్షితంగా తమ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయన్నారు. వన్యప్రాణుల వృద్ధి కేంద్ర ప్రాయోజిత పథకం కొనసాగింపుతోనే ఇదంతా సాధ్యపడిందని సంతోషం వ్యక్తం చేశారు. వన్యప్రాణుల రక్షణ, జీవావరణ సమతుల్యత పాటించడంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతను సూచిస్తున్నాయని అధికారులు హర్షం వ్యక్తం చేశారు.