అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తాం

బీజేపీ హెచ్చరిక ధారవిలో ఉద్రిక్తత, పోలీసులపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులు

Sep 21, 2024 - 20:54
 0
అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తాం

ముంబాయి: మహారాష్ర్టలోని ధారవి మసీదు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామని బీజేపీ నాయకుడు మంగళ్​ ప్రభాత్​ లోధా ప్రకటించారు. సుభానియా మసీదు నిర్మించి సుమారు 40కు పైబడింది. అయితే మసీదులో ప్రార్థనలకు స్థలం సరిపోవడం లేదని పైన మరో అంతస్తు నిర్మించారు. అదే సమయంలో బయటి స్థలాన్ని కాస్త పొడిగించారు. ఇప్పుడు ఇదే స్థలాన్ని కూల్చివేస్తామని గతంలో కూడా నోటీసులిచ్చామని ముంబాయి మున్సిపల్​ కార్పొరేషన్​ చెబుతోంది. శనివారం ఈ మసీదు బయటి గోడలను కూల్చేందుకు రాగా పెద్ద యెత్తున ముస్లింలు ఏకమయ్యారు. పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. ఆ ప్రాంతం గుండా వెళుతున్న వాహనాలను అడ్డుకొని రోడ్డుపై భైఠాయించారు. దీంతో రాళ్లు రువ్వే వారిని ఇక ఉపేక్షించబోమని మంగళ్​ తెలిపారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామన్నారు. 

కాగా ఈ అక్రమ నిర్మాణంపై గతంలోనే ఎమ్మెల్యే ప్రసాద్​ లాడ్​ బీఎంసీకి ఫిర్యాదు చేశారు. అయినా బీఎంసీ పట్టించుకోలేదు. దీంతో ఎమ్మెల్యే బీఎంసీ అధికారులతో తీవ్ర పదజాలంతో మాట్లాడారు. అక్రమ నిర్మాణాన్ని ఆపకుంటే హిందూ సమాజం నుంచి కూడా వేలాది మందిగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, ప్రభుత్వం అప్రమత్తమైంది. రాళ్లు రువ్విన వారిపై ఎఫ్​ ఐఆర్​ నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంపై హిందువులను బెదిరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. దీంతో  హిందూ, ముస్లిం పక్షాలు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.