నాగ్ పూర్ లో పేలుడు ఐదుగురి దుర్మరణం
ఐదుగురికి గాయాలు
నాగ్ పూర్: నాగ్ పూర్ లో గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఈ పేలుడులో ఐదుగురు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే రాష్ర్ట హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై ఆరాతీయాలని అధికారులను ఆదేశించారు. గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.