ప్రతిపక్ష హోదా హుళక్కే!

ఎంవీఎస్​ కూటమికి ఘోర పరాభవం

Nov 23, 2024 - 18:15
 0
ప్రతిపక్ష హోదా హుళక్కే!

ముంబాయి: మహారాష్ట్ర ఎన్నికల్లో ఓ వైపు బీజేపీ (మహాయుతి) భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుండగా, మరోవైపు ఎంవీఎస్​ (మహావికాస్​ అఘాడీ) కనీసం ప్రతిపక్ష హోదానైనా దక్కించుకునే దిశగా ప్రయత్నిస్తోంది. కానీ ఆ మేరకు సీట్లు లభించేలా లేవు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలున్నాయి. ఈ స్థానాల్లో కనీసం 10 శాతం హోదా అయినా ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ సాధించాల్సి ఉంటుంది. అయితే ఎంవీఎస్​ కూటమిలోని ఏ ఒక్క పార్టీకి ఈ సీట్లు దక్కేలా లేకపోవడంతో ప్రతిపక్ష హోదా కూడా హుళక్కేనా అనే వాదన వినిపిస్తుంది. కాంగ్రెస్​ 17, శివసేన 21, ఎన్సీపీ 10 స్థానాలలో ఆదిక్యం దిశగా వెళుతున్నాయి. ఏ ఒక్క పార్టీకి 28 సీట్లు మించకపోవంతో ప్రతిపక్ష హోదాపై నీలినీడలు కమ్ముకున్నాయి.