వయోనాడ్ మృతులు 270
240మంది ఆచూకీ గల్లంతు 400కుపైగా ఇళ్లు నేలమట్టం మనంతావాడీ నదీ ప్రవాహం ఉధృతం దీంతోనే ప్రమాదతీవ్రత పెరిగిందంటున్న అధికారులు
వయోనాడ్: వయోనాడ్ వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గురువారం వరకు 270మంది మరణించినట్లుగా అధికారులు ప్రకటించారు. 240మంది ఆచూకీ తెలియడం లేదన్నారు. 1562 మందిని రక్షించామని, 8107 మందికి సహాయక శిబిరాల్లో ఆవాసం కల్పించామన్నారు. 400 ఇళ్లకు పైగా నేలమట్టమయ్యాయన్నారు.
జూలై 29 మధ్య రాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు ముండక్కై, చురల్ మాలా, అట్టమాలా, నూల్ పూజాలలో నదీ ప్రవాహం ఎక్కువ కావడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఇళ్లు, రోడ్లు, వాహనాలు, వ్యక్తులు కొట్టుకుపోయారు. వయోనాడ్ లో లోయలు, ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాల మీదుగా మనంతావాడీ నదీ ప్రవహిస్తుంది. ఈ నదీ ప్రవహం తొండరముడి కొండచరియల మీదుగా ప్రవహిస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో నదీ నీటిమట్టం పెరగడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. సహాయక చర్యల్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీ ఆర్ ఎఫ్, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మల్లపూరం, కోజికోడ్, కన్నర్, కాసర్ గడ్ జిల్లాలకు కూడా ఐఎండీ భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ విధించింది.