దొందూ దొందే సోరెన్​ అవినీతి, బాబా దేశ విచ్ఛిన్నం 

Dondu Donde Soren's corruption, Baba's country is broken

Sep 21, 2024 - 20:50
 0
దొందూ దొందే సోరెన్​ అవినీతి, బాబా దేశ విచ్ఛిన్నం 

విరుచుకుపడ్డ రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​

రాంచీ: సీఎం హేమంత్​ సోరెన్​, కాంగ్రెస్​ రాహుల్​ గాంధీ (బాబా) దొందూ దొందేనని ఒకరు అవినీతి కేసులో జైలుకు వెళితే, మరొకరేమో దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తుంటారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ ఆరోపించారు. శనివారం ఝార్ఖండ్​ లోని ఇత్ఖోరీలో బీజేపీ పరివర్తన్ ర్యాలీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన సీఎం సోరెన్​ పై మండిపడ్డారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)ల సంకీర్ణ ప్రభుత్వాలు రాష్​ర్టానికి తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తున్నాయన్నారు. వీరంతా కలిసి ప్రజాభిప్రాయం మేరకు పాలన కొనసాగించకుండా నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్​ గాంధీ విదేశాల్లో దేశం పరువు తీసేలా ప్రయత్నిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ, రాష్​ర్ట ప్రజలు దేశంలోని వ్యతిరేక శక్తులను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ స్పష్​టం చేశారు.