ప్రజలతో చర్చించాక కమిటీల ఏర్పాటు
అదనపు కలెక్టర్ కు ఎమ్మెల్యే చింతా వినతి
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: ఇందిరమ్మ కమిటీల ఏర్పాటులో మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు గురువారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వినతి పత్రం అందజేశారు. ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు లో మార్గదర్శకాలు పాటించడం లేదని తమ దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే అదనపు కలెక్టర్ కు వివరించారు. మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించాలని ఎమ్మెల్యేచంద్రశేఖర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, విజేందర్ రెడ్డి, ఆర్. వెంకటేశ్వర్లు, జీవి. శ్రీనివాస్, గుండు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.