కొండంత అండ
ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డికి అందెల అభినందనలు
నా తెలంగాణ, న్యూఢిల్లీ: చేవెళ్ల అభివృద్ధికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరింత తోడ్పాటు అందిస్తారని మహేశ్వరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జీ అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం అనంతరం న్యూ ఢిల్లీలో మంగళవారం అందెల శ్రీరాములు యాదవ్ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేశ్వరం అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచనలు, సలహాలతో ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేసుకుంటామని శ్రీరాములు యాదవ్ స్పష్టం చేశారు. చేవెళ్ల నుంచి ఆయన ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారని అన్నారు. కొండా సారథ్యంలో బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని అందెల స్పష్టం చేశారు.