డేటా ఆదాయమే ఎక్కువ ట్రాయ్​ నివేదిక

Data revenue is high, Troy reports

Aug 23, 2024 - 20:39
 0
డేటా ఆదాయమే ఎక్కువ ట్రాయ్​ నివేదిక

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మొబైల్​ వినియోగదారులు, కాలింగ్​, డేటా వినియోగం భారీగా పెరిగిందని ట్రాయ్​ (టెలికం రెగ్యులేటరీ ఆఫ్​ ఇండియా) వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం నివేదిక విడుదల చేసింది. ఒక్క వినియోగదారుడు నెలకు సగటున 963 నిమిషాలపాటు వాయిస్​ కాల్స్​ కోసం వెచ్చిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో డేటా వినియోగం 19.3 జీబీకి చేరుకుందని తెలిపింది. 

2018 ప్రకారం చూసుకుంటే కాల్స్​ వినియోగం 638 నిమిషాలు ఉండగా, డేటా వినియోగం 0.3 జీబీ మాత్రమే ఉండడం విశేషం. 

2016లో టెలికాం కంపెనీల ఏఆర్​ పీయూ (ఎవరేజ్​ రెవెన్యూ పర్​ యూజర్​) నెలకు రూ. 59 కాగా ప్రస్తుతం ఆ మొత్తం నెలకు రూ. 211కు పెరిగిందని పేర్కొంది. అదే సమయంలో డేటా వినియోగంలో భారీ పెరుగుదల నమోదైనట్లు పేర్కొంది. ఆయా టెలికామ్​ సంస్థలు ప్రస్తుతం వాయిల్​ కాల్స్​ కంటే డేటా అమ్మకం ద్వారా ఎక్కువగా సంపాదిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. గత రెండేళ్ల లో డేటా ద్వారా వచ్చే ఆదాయం 29.5 శాతం వృద్ధి చెందినట్లు స్పష్టం చేసింది.