పాక్​ లో గోధుమ పిండి కిలోరూ. 800!

అసలే ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న పాక్​ లో మరోసారి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

May 1, 2024 - 14:10
 0
పాక్​ లో గోధుమ పిండి కిలోరూ. 800!

ఇస్లామాబాద్​: అసలే ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న పాక్​ లో మరోసారి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బుధవారం పలు పాక్​ ధరలను చూస్తే ఔరా అనిపించక మానదు. మీడియా వివరాల ప్రకారం కిలో గోధుమ పిండి రూ. 800 ధర పలుకుతుండగా, ఒక్క రొట్టెముక్క ధర రూ.25గా ఉంది. దీంతో సగటు నిరుపేదల నోట్లోకి ఐదువేళ్లు వెళ్లడం లేదు. కాగా ప్రభుత్వం సామాన్య పౌరులను విస్మరిస్తూ పాలన కొనసాగిస్తుందని పలువురు విమర్శించారు. పిండిధరలు ఇంతలా పెరిగితే భార్య పిల్లలు ఒకపూట తిని మరోపూట పస్తులే ఉంటున్నారని పలువురు మీడియాతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. గతంలో పిండి ధర కేజీకి రూ. 230గా ఉండేది.