సందేశ్​ ఖాళీ సోదరీమణులను బెదిరిస్తారా?

సీఏఏను వ్యతిరేకిస్తారు శ్రీరాముడిని పూజించొదంటారు టీఎంసీది దుష్టపాలన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ

May 12, 2024 - 14:11
 0
సందేశ్​ ఖాళీ సోదరీమణులను బెదిరిస్తారా?

కోల్​ కతా: సందేశ్​ ఖాళీ సోదరీమణులను (బాధితురాళ్లు)ను టీఎంసీ బెదిరింపులకు గురి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇక్కడి ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకించిందని, రాముని పూజించొద్దంటుందని, రిజర్వేషన్లను కల్పిస్తామని చెబుతోందని మోదీ విమర్శించారు. ఆదివారం పశ్చిమ బెంగాల్​ లోని బరాక్​ పూర్​, హుగ్లీలలో నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడారు. టీఎంసీ బెదిరింపుల రాజకీయాలకు దిగుతోందన్నారు. 

తమ నాయకులను పోలీసులకు అప్పజెప్పకుండా తాత్సారం చేసిందని గుర్తు చేశారు. చివరికి బాధితురాళ్లు రాష్ర్టపతిని కలిస్తే వారికి న్యాయం చేకూరుతుందన్న నమ్మకం లభించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం టీఎంసీ వారిపై బెదిరింపులకు దిగుతోందని మండిపడ్డారు.
స్వాతంత్రం అనంతరం కాంగ్రెస్​ పాలనలో దేశం విచ్ఛిన్నమైందని అన్నారు. దేశంలోని పేదరికాన్ని ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్​, ఝార్ఖండ్​, బిహార్​, ఒడిశా, ఆంధ్రప్రదేశ్​ లో పేదరికంపై ఆయా ప్రభుత్వాలు దూరం చేసే ప్రయత్నం ఏనాడు చేయలేదన్నారు.

ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో భారీ ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన రోడ్ల నిర్మాణం పెద్ద పెద్ ప్రాజెక్టుల నిర్మాణాలను కేంద్రం కొనసాగిస్తుందన్నారు. వీటికి కూడా ఆయా ప్రభుత్వాలు అనేక ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.

టీఎంసీ ఆధ్వర్యంలోనే అనేక మంది రౌడీలు, గుండాలు రక్షింపబడుతున్నారని మోదీ ఆరోపించారు. 

పశ్చిమ బెంగాల్​ లో నేడు హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఆ ప్రభుత్వం చూడడాన్ని తప్పుబట్టారు. వారు నిర్వహించుకునే ర్యాలీలకు అనుమతినీయరని మండిపడ్డారు. టీఎంసీ, కాంగ్రెస్​, వాపక్షాల భావాజాలంతో ఇక్కడి హిందువులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ వర్గాల రిజర్వేషన్లను కూడా లాక్కోవాలని టీఎంసీ చూస్తోందని విమర్శించారు. 

అవినీతి పరులను ఎన్నుకోవద్దని దేశ ప్రతిష్ఠను మరింత పెంచుకునే వారినే ఎన్నుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.