కుంభమేళాకు రైల్వేశాఖ రెఢీ

The railway department is ready for Kumbh Mela

Aug 23, 2024 - 20:46
 0
కుంభమేళాకు రైల్వేశాఖ రెఢీ

లక్నో: 2025 మహాకుంభమేళా కోసం రైల్వే శాఖ భారీ సన్నాహాలను మొదలు పెట్టింది. యూపీలోని ప్రయాగ్​ రాజ్​ కు 900 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. భక్తులకు ఈ రైళ్లలో మెరుగైన సదుపాయాల కల్పన కోసం ఏర్పాట్లను కూడా చేస్తున్నట్లు ప్రకటించింది. బుకింగ్​, టికెట్​, ఆహారం, నీరు, విద్యుత్​, సహాయ, మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు, పర్యవేక్షణ, భద్రత, స్పెషల్ టీమ్​ లు, మెడికల్​, ఎమర్జెన్సీ, సెక్యూరిటీ, వికలాంగుల ప్రయాణానికి ఏర్పాట్లు తదితరాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. 

కుంభమేళా కోసం ప్రయాగ్​ రాజ్​ లో 21 రైల్వే రోడ్డు ఓవర్​ బ్రిడ్జిలు, అండర్​ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టినట్లు తెలిపింది. ఈ కుంభమేళాకు సుమారు 30 కోట్ల మంది వస్తారని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. ఇందులో సింహభాగం రైల్వే ద్వారా గమ్యస్థానాలకు చేర్చి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోంది. 

ఇక భారీ ఎత్తున ప్రజలు రానుండడంతో ఇంటలిజెన్స్​ బృందాలు కూడా రైల్వేశాఖ, రైల్వే లైన్లపై దృష్టి సారించినున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.