దాస్​ ను విడుదల చేయాలి

అరెస్టు అక్రమం మాజీ ప్రధాని హసీనా ప్రకటన విడుదల

Nov 28, 2024 - 18:42
 0
దాస్​ ను విడుదల చేయాలి

మైనార్టీల హక్కులను కాపాడాలి

ఢాకా: ఇస్కాన్​ గురువు చిన్మోయ్​ కృష్ణదాస్​ అరెస్టు అక్రమమని, ఆయనను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్​ మాజీ ప్రధానమంత్రి షేక్​ హసీనా డిమాండ్​ చేశారు. బంగ్లాదేశ్​ లో హిందువులు, దేవాలయాలపై దాడులను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. గురువారం బంగ్లాదేశ్​ అవామీ లీగ్​ మాజీ ప్రధాని షేక్​ హసీనా ప్రకటనను విడుదల చేశారు. 

ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి ఘటనలు దేశ భవిష్యత్​ ను అంధకారంలో పడవేస్తాయన్నారు. వీటికి వ్యతిరేకంగా బంగ్లాదేశ వాసులంతా ఒక్కటిగా నిలిచి మైనార్టీలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చిట్టగాంగ్​ లో న్యాయవాది హత్యను ఖండించారు. హత్యకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్​ చేశారు. వృత్తిపరమైన విధులు నిర్వహిస్తే అతడిని సైతం చంపడం ఉగ్రవాదానికి నిర్వచనమేనన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించిన వారు ఎవ్వరినైనా శిక్షించాల్సిందేనన్నారు.

ఒకవేళ ఉగ్రవాదులను శిక్షించడంలో యూనస్​ ప్రభుత్వం విఫలమైతే మానవహక్కుల ఉల్లంఘన శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని బంగ్లాదేశ్​ లోని అవామీ లీగ్​ పార్టీ పేర్కొంది.