జేరూసలెం: ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా భారీ దాడికి పాల్పడింది. శనివారం ఒక్కసారిగా 1300 డ్రోన్లు, రాకెట్లతో దాడికి పాల్పడింది. దీంతో ఇజ్రాయెల్ కు చెందిన పలు సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో మిడిల్ ఈస్ట్ లో మరింత ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 1300 డ్రోన్లు, రాకెట్ల దాడిలో చాలామేరకు ఐరన్ డ్రోమ్ లు అడ్డుకున్నా కొన్ని మాత్రం సైనిక స్థావరాలను నాశనం చేశాయి.
అయితే ఈ దాడులపై విభిన్న ప్రకటనలు వెలువడ్డాయి. హిజ్బుల్లా దాడులను చేసి అన్ని సైనిక స్థావరాలను మట్టుబెట్టామని అంటుంటే, మరోవైపు ఇజ్రాయెల్ ఐరన్ డ్రోన్ లతో అడ్డుకున్నామని తెలిపింది. దీనికి ప్రతీ చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
దీంతో గాజా, పాలస్తీనా ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హిజ్బుల్లా తమ నాయకులు, సైనిక స్థావరాలు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో గాజా స్ట్రిప్‌లో పాలస్తీనియన్ల మారణకాండను అంతం చేయకపోతే మరిన్ని ఘోరమైన దాడులు చేస్తామని హిజ్బుల్లా ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది.