హైకోర్టులో కేజ్రీవాల్​కు ఊరట

సీఎం పదవి తొలగింపు పిటిషన్​తిరస్కరణ

Apr 4, 2024 - 18:56
 0
హైకోర్టులో కేజ్రీవాల్​కు ఊరట

న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. సీఎంగా ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్​ను న్యాయస్థానం స్వీకరించలేదు. గురువారం ఈ పిటిషన్​విచారణకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంపై రాజ్యాంగ అధికారుల్ని సంప్రదించాలని పిటిషన్​కు సూచించింది. కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనం అనేది జాతీయ ప్రయోజనాలకు లోబడి ఉండాలని, కానీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా? వద్దా? అనేది కేజ్రీవాల్ చేతిలోనే ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతి పాలన లేదా గవర్నర్ పాలనని కోర్టు విధించిన ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? అని న్యాయస్థానం పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇదిలావుండగా.. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ను తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అవ్వడం ఇది రెండోసారి. మార్చి 28వ తేదీన సుర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన్ను సీఎంగా తొలగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. దానిని న్యాయస్థానం కొట్టివేసింది. ఈ సమస్యను ఎగ్జిక్యూటివ్, రాష్ట్రపతి పరిశీలించాలని, న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది.