మసీదు సర్వేపై ఆందోళనల్లో ఎస్పీ ఎంపీ, ఎమ్మెల్యే కుమారుడి హస్తం

SP MP and MLA's son is involved in concerns over mosque survey

Nov 25, 2024 - 12:55
 0
మసీదు సర్వేపై ఆందోళనల్లో ఎస్పీ ఎంపీ, ఎమ్మెల్యే కుమారుడి హస్తం

ప్రత్యేక బృందాల గాలింపు
ఇంటర్నెట్​ నిలిపివేత, పాఠశాలలకు సెలవు, అదనపు బలగాల మోహరింపు
బీజేపీ కుట్రేనన్న అఖిలేష్ యాదవ్​ ఇప్పుడేమంటారని బీజేపీ నిలదీత

లక్నో: సంభాల్​ మసీదు సర్వే నేపథ్యంలో ఆదివారం చెలరేగిన హింసలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జియావుర్​ రెహమన్​ బుర్కే, మరో ఎమ్మెల్యే  కుమారుడు హస్తం వెలుగుచూసింది. మొరాదాబాద్​ డివిజనల్​ పోలీసు కమిషనర్​ ఆధ్వర్యంలో ప్రత్యేకబృందం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. 

ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే సోహైల్​ ఇక్బాల్​ పై పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వీరిద్దరు ప్రణాళిక ప్రకారం మసీదు సర్వేను అడ్డుకోవాలని సమూహాన్ని ప్రేరేపించారు. ఒక్కసారిగా ఆదివారం మధ్యాహ్నం మసీదు వద్దకు చేరుకొని పోలీసులపైకి, స్థానిక దుకాణాలపైకి రాళ్లు రువ్వారు. పోలసులు పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో పోలీసులు కాల్పులకు దిగడంతో నలుగురు మృతి చెందారు. సంభాల్​ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రంతా ఆందోళనల్లో పాల్గొన్న నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు సోదాలు నిర్వహించారు. 

సంభాల్​ లో ఇంటర్నెట్​ నిలిపివేశారు. 30 పోలీస్​ స్టేషన్ల నుంచి అదనపు బలగాలను రప్పించారు. ఇక్కడి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు 21మందిని అదుపులోకి తీసుకునారు. వీరి వద్ద నుంచి అక్రమ ఆయుధాలు, లైవ్​ కాట్రిడ్జ్​ లు స్వాధీనం చేసుకున్నారు. బయటి వ్యక్తుల ప్రమేయాన్ని నిషేధించారు. 
హింసాకాండ బీజేపీ కుట్రలేనని ఎస్పీ అఖిలేశ్​ యాదవ్​ ఆరోపించడం వెనుక ఆ పార్టీ నాయకులను రక్షించాలనే ఉద్దేశ్యం దాగి ఉందని, అసలు ఈ హింసకు ఆ పార్టీ నాయకులే కారకులని బీజేపీ మండిపడింది.

అసలేమిటి సంభాల్​ మసీదు వివాదం?..
15వ శతాబ్ధానికి ముందు సంబాల్​ మసీదు స్థానంలో హరిహరుని ఆలయం ఉండేది. 1526లో బాబర్​ ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి జామా మసీదును నిర్మించారని పలు హిందూ సంఘాలు స్థానిక కోర్టులో పిటిషన్​ దాఖలు చేశాయి. కోర్టు సమగ్ర విచారణ అనంతరం సర్వే జరపాలని తీర్పునిచ్చింది. సర్వేను ముస్లింపక్షాలు వ్యతిరేకించాయి, అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. ఆదివారం సర్వే బృందం భారీ పోలీసు బందోబస్తుతో మసీదులో సర్వే చేపట్టారు. అదే సమయంలో ఎంపీ, ఎమ్మెల్యే కుమారుడి నేతృత్వంలో భారీ ఎత్తున ముస్లింపక్షాలు సమూహాలకు ఆందోళన చేపడుతూ పోలీసులపైకి రాళ్లు రువ్వారు. మసీదు స్థానికంగా ఉన్న ప్రాంతాల్లోని వాహనాలను, ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. దుకాణాలపై రాళ్లు రువ్వారు. పోలీసులు లాఠీచార్జీ, భాష్పవాయువు ప్రయోగించినా వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు ఫైరింగ్​ చేశారు. ఈ ఫైరింగ్​ లో నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం ఈ ఆందోళనకు, ఉద్రిక్తతలకు కారణమైన ఎంపీ, ఎమ్మెల్యే కుమారుడు ఇద్దరూ పరారీలో ఉన్నారు.