2025 స్టాక్ మార్కెట్​ సెలవులు 118 రోజులు

2025 stock market holidays are 118 days

Dec 31, 2024 - 17:17
 0
2025 స్టాక్ మార్కెట్​ సెలవులు 118 రోజులు

ముంబాయి: 2025లో స్టాక్​ మార్కెట్​ సెలవులను మంగళవారం బీఎస్​ ఈ, ఎన్​ ఎస్​ ఈలు ప్రకటనను విడుదల చేశాయి. 2025లో 52 శని, 52 ఆదివారాలు, మరో 14 పండుగ సెలవులను ప్రకటించారు. మొత్తం 118 రోజులపాటు స్టాక్​ మార్కెట్​ లు సెలవులను ప్రకటించారు. ఈ యేడాది చివరలో స్టాక్​ మార్కెట్​ ఒడిదుడుకులకు లోనయ్యింది. కాగా రానున్న యేడాదిలో లాభాలాపై భారీ ఆశలు పెట్టుకుంది. 
సెలవులు..
26 ఫిబ్రవరి శివరాత్రి , 14 మార్చి హోలీ, మార్చి 31 ఈద్​ ఉల్​ ఫితర్​, ఏప్రిల్​ 10 మహావీర్​ జయంతి, ఏప్రిల్​ 14 అంబేద్కర్​ జయంతి, ఏప్రిల్​ 18 గుడ్ ఫ్రైడే, మే 1 మహారాష్ర్ట అవతర దినోత్సవం, ఆగస్ట్​ 15 స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్ట్​ 27 వినాయక చతుర్ధి, అక్టోబర్​ 2 గాంధీ జయంతి, అక్టోబర్​ 21, 22 దీపావళి, నవంబర్​ 5 గురునానక్​ దేవ్​ పర్వదినం, డిసెంబర్​ 25 క్రిస్మస్​ లలో సెలవులు ప్రకటించారు. అయితే దీపావళి రోజున ముహూరత్​ ట్రేడింగ్​ సందర్భంగా సాయంత్రం ఒక గంటపాటు మార్కెట్లో లావాదేవీలు జరుగుతాయి.