అవరోధాలను అధిగమించాం ప్రధాని నరేంద్ర మోదీ
Prime Minister Narendra Modi has overcome obstacles
వికిసిత్ భారత్ కు 2025లో కృతనిశ్చయంతో పనిచేస్తాం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2024లోని కీలక మైలు రాళ్లను దాటామని, అనేక అవరోధాలను అధిగమించామని, రాబోయే సంవత్సరం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తూ భారత్ ను ప్రపంచదేశాల్లో ప్రత్యేక స్థానంలో నిలబెట్టుకుందామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం 2024 ముగింపు రోజున సామాజిక మాధ్యమం వేడుకగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో వికసిత్ భారత్ కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని పునరుద్ఘాటించారు.