ఈజ్ ఆఫ్ డూయింగ్ తో వ్యాపారం మరింత సులభతరం
కేంద్రమంత్రి పీయూష్ గోయల్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సీఐఐ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ పోర్టల్ ద్వారా వ్యాపార సౌలభ్యం మరింత మెరుగుపరుస్తుందని, పరిశ్రమలు, వివిధ శాఖలు, విభాగాలు ఏకతాటిపైకి వచ్చాయని పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గురువారం న్యూ ఢిల్లీలోని సీఐఐ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ పోర్టల్‌ను వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం, సీఐఐ ద్వారా వ్యాపార, వాణిజ్యాలను మరింత సౌకర్యవతంగా మార్చనున్నారు. ఈ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు పరిశ్రమల ప్రతినిధులు మరింతగా దృష్టి సారించాలన్నారు. నిరంతరం ఈ కార్యక్రమంపై తమ అభిప్రాయాలను పంచుకోవాలన్నారు. చట్టంలోని లొసుగులను ఉపయోగించే ధోరణిని విడనాడాలన్నారు. ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ కు హానికరమన్నారు. చట్టస్ఫూర్తిని గౌరవిస్తూ జన్ విశ్వాస్ 2.0 కింద నేర రహిత వ్యాపారాన్ని కొనసాగించాలని మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పాన్ 2.0 ద్వారా సాంకేతిక అప్ గ్రేడేషన్ ప్రణాళికలో భాగమన్నారు. కేంద్ర ప్రభుత్వ పోర్టళ్లను మరింత మెరుగుపరిచేందుకు, వేగంగా సమాచారాన్ని అందించేందుకు అప్ గ్రేడ్ చేయడం అవసరమని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.