ఈఎస్ఐసీ కార్మికులకు ఆయుష్మాన్ ప్రయోజనాలు
Ayushman benefits for ESIC workers
కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల
14.43 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రజారోగ్యాన్ని పెంపొందించేందుకు ఈఎస్ ఐసీ, ఆయుష్మాన్ భారత్ పీఎంజేఎవైతో కలిసి పనిచేస్తుందన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలను ఈఎస్ ఐసీ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు వర్తింప చేస్తుందని స్పష్టం చేశారు. దీంతో కార్మికుల ఆరోగ్యాన్ని పెంపొందించే, విస్తరించే చర్యలను చేపట్టామని గురువారం కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమం ద్వారా 14.43 కోట్ల మంది ఈఎస్ ఐ లబ్ధిదారులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. దేశమంతటా నాణ్యమైన, సమగ్రమైన వైద్య సంరక్షణకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భవ పథకానికి సంబంధించిన 30వేల ఆసుపత్రుల్లో కార్మికులూ వైద్య సేవలను పొందగలుగుతారని స్పష్టం చేశారు. చికిత్స ఖర్చులపై పరిమితులుండవని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈఎస్ ఐ చారిటబుల్ ఆసుపత్రులను కూడా ఎంపానెల్ చేస్తామని పేర్కొన్నారు.