2025 వేడుకలు ప్రారంభం

2025 celebrations begin

Dec 31, 2024 - 17:33
 0
2025 వేడుకలు ప్రారంభం

భారత్​ కంటే ముందు 41 దేశాల నిర్వహణ!

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కిరీటిమతి దీవిలో ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఇక్కడే కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభం అవుతాయి. ప్రపంచ టైమ్​ జోన్​ ప్రకారం ఇక్కడ సమయం భారత కాలమానంతో పోలిస్తే ముందు ఉంటుంది. ఈ ద్వీపం పసిఫిక్​ మహాసముద్రంలో ఉంది. భారత కాలమానం ప్రకారం ఈ దీవిలో 3.30 గంటలకే న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​ ప్రారంభమయ్యాయి. టైమ్​ జోన్​ ప్రకారం భారత్​ కంటే ముందే కొత్త సంవత్సరం వేడుకలను నిర్వహించే 41 దేశాలున్నాయి. న్యూజిలాండ్​ ఆక్లాండ్​ లోని ఐకానిక్​ స్కై టవర్​ వద్ద కూడా న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​ ప్రారంభమయ్యాయి. 2024కు బైబై చెబుతూ 2025కు వెల్​ కమ్​ చెబుతూ బాణాసంచా పేల్చిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. 

2025 భారత్​ కంటే ముందు నిర్వహించుకున్న కొన్ని దేశాలు.. 
3:30 - కిరిటిమతి ద్వీపం
3:45 - చతం దీవులు
4:30 - న్యూజిలాండ్
5:30 - ఫిజీ, రష్యాలోని కొన్ని నగరాలు
6:30 - ఆస్ట్రేలియా
8:30 - జపాన్, దక్షిణ కొరియా
8:45 - పశ్చిమ ఆస్ట్రేలియా
9:30 - చైనా, ఫిలిప్పీన్స్
10:30 - ఇండోనేషియా