జనవరి 1 నుంచి ‘నూతనం’
మారనున్న పలు నిబంధనలు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: 2025 నూతన సంవత్సరంలో పలు అంశాలు, పరిమితులు మారనున్నాయి. మార్పులు చేసుకోనున్న అంశాలు ఏంటో తెలుసుకుందాం.
1. యూపీఐ పేమెంట్ పరిమితి పెంచారు. జనవరి 1 నుంచి 10వేలు ఆన్ లైన్ పేమెంట్ చేయొచ్చు. ప్రస్తుతం ఫీచర్ ఫోన్లతో యూపీఐ పేమెంట్ రూ. 5వేలుగా ఉంది.
2. పెన్షన్ లు ఏదైనా బ్యాంకుల్లో నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. ఇంతకుముందు అకౌంట్ ఏ బ్యాంకులో ఉంటే అదే బ్యాంకులో నుంచి పెన్షన్ ను తీసుకునే సౌకర్యం ఉండేది.
3. రైతులకు గ్యారంటీ లేకుండా రూ. 2 లక్షల రుణం లభించనుంది. ఆర్బీఐ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇంతకుముందు ఈ పరిమితి రూ. 1.6 లక్షలుగా ఉంది.
4. ఇకపై టెలికామ్ సంస్థలు ఎస్ ఎంఎస్ ప్యాక్ లను కూడా ఉచితంగానే అందజేయాల్సి ఉంటుంది. కాలింగ్, డేటాల కోసం ప్రత్యేక ప్యాకేజీలను అందజేయనుంది. కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశకాలు జనవరి 1 నుంచే అమల్లోకి రానున్నాయి. దీంతో డేటా వాడని వినియోగదారులకు కాలింగ్ ప్యాక్ తక్కువ ధరకే లభిస్తుంది.
5. మారుతి, హుందాయ్, టాటా, కియా, ఎంజీ మోటార్స్ లాంటి కార్లు మరింత ప్రియం కానున్నాయి. బైకుల ధరలు కూడా 2 నుంచి 3 శాతం పెరగనున్నాయి. వాహన సంస్థలు రూపొందిస్తున్న వాహనాల విడిభాగాల ధరలు భారీగా పెరగడంతో సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తితో ఈ పెరుగుదల చోటు చేసుకుంది.
6. పాత ఫోన్లలో ఇక వాట్సాప్ పనిచేయదు. ఆండ్రాయిడ్ 4.4, అంతకుముందు ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.
7. కాలుష్య నిబంధనలు మరింత కఠినతరం చేశారు. 2025 ఏప్రిల్ 1 నుంచి బీఎస్–7 ‘భారత్ స్టేడ్–7’ను అమలు చేయనున్నారు. ఈ నిబంధన ప్రకారం 15యేళ్లు దాటిన వాహనాలన్నీ తుక్కుగానే భావించాల్సి ఉంటుంది.
8. ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ తిరిగి రానున్నారు. ఆర్సీబీ కెప్టెన్ గా ఆడనున్నారు. ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్ గా సౌత్ ఆఫ్రికాకు చెందిన డూప్లెసిస్ వ్యవహరిస్తున్నారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ తరువాత రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ చెప్పనున్నారు.
9. నో డిటెన్షన్ పాలసీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పాలసీ ప్రకారం 5, 8 తరగతుల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణలు కావాలి లేదంటే కింది తరగతిలోనే కూర్చోబెట్టనున్నారు. అయితే ఉత్తీర్ణత సాధించని వారికి రెండు నెలల్లో మరోమారు పరీక్ష పెట్టనున్నారు. అంటే ఈ రెండు తరగతులకు బోర్డ్ ఎగ్జామ్ నియమ నిబంధనలను వర్తింప చేశారు. అదే సమయంలో ఆయా రాష్ర్టాలు ఈ కేంద్ర విద్యాశాఖ నియమ నిబంధనలను పాటించాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయాన్ని వారికే వదిలేశారు. ఈ నిబంధన అన్ని కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో అమలు కానుంది.
10. అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. సీఐఎస్ఎఫ్, బీఎస్ ఎఫ్ లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్ ను ప్రకటించారు. ఫిజికల్ టెస్ట్, వయస్సులపై కూడా నిబంధనలను సడలించారు.
ఇవే గాక ఆదాయపు పన్ను, ఎగుమతి పన్నులు, కొత్త పథకాల ప్రకటన కూడా 1 ఫిబ్రవరిన బడ్జెట్ లో ప్రకటించనున్నారు.
ప్రతీ నెలా 1వ తేదీన కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ సిలీండర్ల కొత్త ధరలను ప్రకటించనున్నారు.