టేక్మాల్ గ్రామాభివృద్ధికి కృషి  డీపీఓ యాదయ్య

DPO Yadaiah is working for Tekmal village development

Sep 28, 2024 - 19:24
 0
టేక్మాల్ గ్రామాభివృద్ధికి కృషి  డీపీఓ యాదయ్య

నా తెలంగాణ, అందోల్: టేక్మాల్ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీపీఓ యాదయ్య అన్నారు. శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామసభకి ముఖ్య అతిథిగా డీపీవో యాదయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నీటి ప్లాంటు ప్రారంభం, మిషన్​ భగీరథ నీరు వచ్చేలా చూస్తానని గ్రామ కార్యదర్శి రాకేష్​ హామీ ఇచ్చారు. స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా  గ్రామంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు  చీరలు, దుస్తులు పంపిణి చేశారు. 

ఈ కార్యక్రమంలో డీపీవో యాదయ్య, ఏపిఓ రియాజుద్దీన్, గ్రామ కార్యదర్శి రాకేష్ కుమార్, మిషన్ భగీరథ ఏఇ సాయి కృష్ణ, వైద్య సిబ్బంది భూదేవి, అంగన్​ వాడీ సూపర్​ వైజర్​ శైలజ, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్, బఆర్ఎస్ నేతలు రవి, నాయికోటి భాస్కర్, కమ్మరి సిద్దయ్య, వివిధ పార్టీల ముఖ్య నేతలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.