ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు
Bhagat Singh's birth anniversary celebrations
నా తెలంగాణ, అందోల్: అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల కేంద్రంలో శనివారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లుపేట రాజు ఆధ్వర్యంలో భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎల్లుపేట రాజు మాట్లాడుతూ భగత్‌సింగ్ చదువుకున్న రోజుల్లోనే జులియన్‌వాలాబాగ్ దుర్ఘటనతో చలించిపోయారని అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం 23 సంవత్సరాలకే ప్రాణత్యాగం చేసి ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కుమ్మరి సిద్ది రాములు, మండల ఉపాధ్యక్షులు వడ్డె రాములు బూత్ అధ్యక్షులు మంగలి వెంకట్, నాగరాజు, గోపాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.