సైబర్​ క్రైమ్​ చైనా పనే!

Cybercrime works in China!

Dec 11, 2024 - 12:03
 0
సైబర్​ క్రైమ్​ చైనా పనే!

ఉచ్చులోకి భారతీయ నిరుద్యోగులు
ఇంటలిజెన్స్​, ఎన్​ ఐఎ అరెస్టుల్లో కీలక విషయాలు
గోల్డెన్​ ట్రయాంగిల్​ రాకెట్​ కుట్రలు బట్టబయలు
సైబర్​ నేరాలకు అడ్డాగా లావోస్​
548 మందిని రక్షించిన భారత విదేశాంగ శాఖ
కింగ్​ పిన్​ ముఠాలు ఇంకా క్రియాశీలకమే

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: భారతీయ నిరుద్యోగులకు సైబర్​ ఉద్యోగాల పేరుతో ఉచ్చులోకి లాగి వియత్నంలోని లావోస్​ కు పంపి అక్కడ సైబర్​ నేరాల్లో శిక్షణ ఇస్తూ వారి ద్వారా నేరాలు చేయిస్తూ చైనాకు చెందిన ముఠాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ముఠాల ఉచ్చులో చిక్కుకున్న, అక్రమంగా లావోస్​ కు పంపుతున్న ఒక ముఠాను ఇటీవలే భారత ఇంటలిజెన్స్​, ఎన్​ ఐఎలు గుర్తించి పట్టుకున్నాయి. ఈ ముఠాకు భారత్​ లో కీలకంగా వ్యవహరించిన కర్మన్​ హైదర్​ అనే నిందితుడిని అరెస్టు చేశాయి. అతనిని విచారించగా పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

అక్రమ దందాలకు స్వర్గధామంగా లావోస్​..
ఇతన్ని విచారించగా లావోస్​ లోని గోల్డెన్​ ట్రయాంగిల్​ రాకెట్​ ను భద్రతా దళాలు చేధించాయి. హైదర్​ తోపాటు అతని సహచరులు మంజూర్​ ఆలం, గుడ్డు సాహిల్​ పవన్​ యాదవ్​, అఫ్​రోజ్​ లతో కలిసి పనిచేస్తున్నట్లు గుర్తించారు. వీరంతా చైనాకు చెందిన పలు ముఠాలతో చేతులు కలిపి వారి ద్వారా భారత్​ లో రుణాల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. ఇంతేగాక సైబర్​ నేరాలకు తెరలేపారు. గోల్డెన్​ ట్రయాంగిల్​ స్పెషల్​ ఎకనామిక్​ జోన్​, లావోస్​, సైబర్​ కేంద్రానికి కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా ఇక్కడి నుంచే సైబర్​ నేరాలు జరుగుతున్నాయి. స్కామ్​, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలకు ఈ ప్రాంతం స్వర్గధామంగా మారింది. 

చైనీయుల కుట్రలు..
చైనీస్ సిండికేట్‌లు భారత్, ప్రపంచంలోని వివిధ దేశాలలో ఈ నేరాలకు పాల్పడుతున్నాయని తేలింది. ఉద్యోగం లేని భారతీయ నిరుద్యోగులను ఉద్యోగం పేరిట ట్రాప్​ చేస్తూ వారిని లావోస్​ కు పంపిస్తూ అక్కడ ట్రైనింగ్​ ఇచ్చి వారు సైబర్​ నేరాలు చేయకుంటే వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది. దీంతో వీరి ఉచ్చులో చిక్కుకున్న భారతీయులు వారు చెప్పినట్లు చేయకతప్పడం లేదు. ఈ నేరాలకన్నింటికీ చైనీయ సంస్థలే కారణమైనా భారతీయులు చేస్తున్న అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠను మసకబార్చే ప్రయత్నానికి చైనా తెరలేపిందనేది జగమెరిగిన సత్యం. ఇతపెద్ద సిండికేట్​ మూలాలు లావోస్​ నుంచి బయటపడుతున్నా అక్కడి అధికారులు మాత్రం దీన్ని ఆపలేకపోతున్నారు. కారణం ఈ ప్రాంతం చైనీస్​ ముఠాలకు అడ్డాగా మారింది. దీనికి తోడు ఇక్కడ చట్టాల్లోని లొసుగులను ఉపయోగిస్తూ చైనీస్​ సిండికేట్​ లు సులభంగా తమ పనికానిచ్చేస్తున్నాయి. 

భారత్​ విదేశాంగ శాఖ చర్యలు.. 548 మంది వెనక్కు..
వీరి ఉచ్చులో చిక్కుకున్న భారతీయ నిరుద్యోగులను వెనక్కు రప్పించేందుకు ఇప్పటికే భారత్​ అనేక చర్యలు తీసుకుంటుంది. ఒకవైపు మనకు లభించిన ఆధారాలను అంతర్జాతీయ సమాజం ముందు పెడుతూనే మరోవైపు లావోస్​ లోని భారత రాయబార కార్యాలయం ఏజెన్సీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది. గోల్డెన్​ ట్రయాంగిల్​ స్పెషల్​ ఎకనామిక్​ జోన్​ లో చైనీస్​ ఉచ్చులో చిక్కుకొని సైబర్​ నేరాలకు పాల్పడుతున్న 14 మంది భారతీయులను క్షేమంగా ఇక్కడకు తీసుకురాగలిగింది. ఇప్పటివరకూ వీరి ఉచ్చులో చిక్కున్న వారిలో మొత్తం 548 మందిని భారత విదేశాంగ శాఖ నిరంతర చర్చల ద్వారా సురక్షితంగా కాపాడగలిగింది. లావోస్​ లో ఉద్యోగ ఆఫర్లు ఇస్తున్న వారిని ఓ కంట కనిపెడుతూనే ఆయా సంస్థల్లో భారతీయ నిరుద్యోగులు మొగ్గు చూపకుండా చర్యలు తీసుకుంటోంది. 

కింగ్‌పిన్ (జిసానా కియోపింఫాను థాయ్)..
చాలా మంది భారతీయులను ప్రభావితం చేస్తున్న ఈ మొత్తం రాకెట్‌ను గోల్డెన్ ట్రయాంగిల్ ఎకనామిక్ జోన్‌లో చైనాకు చెందిన జిసానా కియోపింఫా థాయ్​ (కింగ్​ పిన్​)  త్రయం నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. కింగ్‌పిన్ వ్యభిచార గృహాలు, ఆన్‌లైన్ మోసాలు, మానవ అక్రమ రవాణా, జంతువుల భాగాలు, డ్రగ్స్ స్మగ్లింగ్‌ను నడుపుతున్నాడు. ఇతన్ని అరెస్టు చేసినా ఇతను సృష్టించిన గ్రూపులు యథేచ్ఛగా తమ పనులు చక్కబెడుతుంటాయి. జైలు నుంచే కింగ్​ పిన్​ తన రాచకార్యాలను చక్కబెడుతుంటాడు.