కురుక్షేత్రంలో అపార అవకాశాలు

కేంద్రమంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​

Dec 10, 2024 - 20:25
 0
కురుక్షేత్రంలో అపార అవకాశాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత ప్రాచీన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, దార్శనికతను పునరుజ్జీవింపచేసేందుకు పుణ్యభూమి కురుక్షేత్రం (హరియాణా)లో అపారమైన అవకాశాలున్నాయని కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్​ అన్నారు. అంతర్జాతీయ గీతా మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన అఖిల భారత దేవస్థానం తొలి సదస్సులో షెకావత్​ మంగళవారం పాల్గొని ప్రసంగించారు. దేశంలోని భావి తరాన్ని విశ్వాసంతో అనుసంధానం చేసేందుకు సాధువులు, పండితులందరూ ఒకే వేదికపై కూర్చొని మేధోమథనం చేయాలన్నారు. ఈ సందర్భంగా, బంగ్లాదేశ్‌లోని హిందువులు, దేవాలయాలను రక్షించడానికి గీతా జయంతి రోజున గీతా శ్లోకాలను అంకితం చేస్తామని సాధువులందరూ ప్రతిజ్ఞ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ కృషి వల్లే దేశంలోని కాశీ, కేదార్‌నాథ్, ఉజ్జయిని, జగన్నాథ ఆలయాలు వైభవంగా, సుందరంగా రూపుదిద్దుకున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ఇది దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో దోహదపడిందని షెకావత్​ స్పష్​టం చేశారు.