అమిత్ షాపై ఫేక్ వీడియో.. కాంగ్రెస్, ఆప్ కు సంబంధించిన ఇద్దరి అరెస్టు
అహ్మాదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో నిందితులు ఏడు రాష్ట్రాలకు బృందాలు, 16 మందికి నోటీసులు
నా తెలంగాణ, న్యూఢిల్లీ: అమిత్ షా పై ఫేక్ వీడియోలకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ పీఏ, ఆప్ నాయకుడిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అహ్మాదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వీరు అమిత్ షా వీడియోలను కట్ చేసి వైరల్ చేశారని పోలీసులు చెబుతున్నారు. తదుపరి విచారిస్తున్నామని మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
సతీష్ వాన్సోలా (కాంగ్రెస్), ఆర్బీ బారియా (ఆప్)లు నిందితులుగా పేర్కొన్నారు. సతీష్ ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్వహిస్తుండగా, ఆర్‌బీ బరియా ఆమ్ ఆద్మీ పార్టీ దాహోద్ జిల్లా చీఫ్‌గా ఉన్నారు. వీరిద్దరూ షా ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు గుర్తించారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఏడు రాష్ట్రాలు, 16 మంది నేతలకు ఈ ఫేక్ వీడియోలను ప్రచారం చేసిన విషయంలో సమన్లు జారీ చేశారు. తమతమ మొబైళ్లను కూడా వెంట తీసుకురావాలని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఢిల్లీ పోలీసుల బృందాలు జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, నాగాలాండ్‌లకు వెళ్లారు. ఫేక్ వీడియో కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా పోలీసులు సమన్లు జారీ చేయడం విశేషం.