అయోధ్య మసీదు నిర్మాణం.. ట్రస్ట్ కు నిధుల కొరత!
Construction of Ayodhya Mosque.. Lack of funds for Trust!
నాలుగు కమిటీల రద్దు
ఫారిన్ యాక్ట్ నిధుల సేకరణ అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయం
అనుమతి లభిస్తేనే విదేశాల ద్వారా నిధులందే అవకాశం
లక్నో: అయోధ్య మసీదు నిర్మాణానికి ట్రస్ట్ తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటోంది. మరోవైపు మసీదు ఏర్పాటుకు సంబంధించిన నాలుగు కమిటీలను కూడా రద్దు చేసినట్లు ఐఐసిఎఫ్ చీఫ్ ట్రస్టీ, సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జుఫర్ ఫరూఖీ తెలిపారు. ఫరూఖీ అధ్యక్షతనజరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రద్దు అయిన కమిటీల్లో అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, డెవలప్‌మెంట్, మసీద్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా, మీడియా అండ్ పబ్లిసిటీ కమిటీలు ఉన్నాయి. గత నాలుగేళ్లలో మసీదు ట్రస్ట్ కేవలం కోటిరూపాయను మాత్రమే పొందగలిగింది. అయోధ్యలో మసీదు నిర్మాణ బాధ్యతలను ఇండో -ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ చేపట్టింది. మరోవైపు నిధుల సమీకరణకు ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ (ఎఫ్‌సిఆర్‌ఎ) కింద అవసరమైన అనుమతులను పొందే ప్రక్రియను వేగవంతం చేయడంపై దృష్టి సారించింది. ఈ అనుమతులు లభిస్తేనే విదేశాల నుంచి విరాళాలు పోగు చేయగలదు.