చిన్మోయ్​ దాస్​ న్యాయవాదిపై దాడి

పరిస్థితి విషమం ఐసీయూలో చికిత్స

Dec 3, 2024 - 13:09
 0
చిన్మోయ్​ దాస్​ న్యాయవాదిపై దాడి

కేసు విచారణ జనవరి 2కి వాయిదా
దాడులను ఖండించిన బ్రిటన్​ పార్లమెంట్​ 
భారతీయ మీడియా ప్రసారాలపై నిషేధం
ఢాకా: ఇస్కాన్​ చిన్మోయ్​ దాస్​ న్యాయవాదిపై దాడి జరిగింది. ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం చిన్మోయ్​ దాస్​ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది రామెన్​ రాయ్​ హాజరుకావాల్సి ఉండగా ఆయనపై ముష్కరులు దాడికి పాల్పడ్డారు. దీంతో కోర్టు విచారణను జనవరి 2కు వాయిదా వేసింది. బంగ్లాదేశ్​ లో మత ఛాందసవాదులు హిందువులు, మైనార్టీలు, సాదువులపై దాడులకు పాల్పడుతున్నారు. 

న్యాయవాది రాయ్​ పై దాడికి సంబంధించిన ఫోటోలను ఇస్కాన్​ ఉపాధ్యక్షుడు రాధారామన్​ దాస్​ విడుదల చేశారు. హిందువులే లక్ష్యంగా ముష్కరులు దాడులకు పాల్పడుతున్న తాత్కాలిక ప్రభుత్వం తమకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కోర్టు బయటే భారతీయులు పెద్ద యెత్తున చేరుకొని బెయిల్​ ఇవ్వాలని నిరసన చేపట్టారు. 

చిన్మోయ్​ దాస్​ తోపాటు 18 మందిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు. ఇస్కాన్​ 17మందికి చెందిన బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్​ చేశారు. 
మైనార్టీలపై దాడుల పట్ల బ్రిటన్​ పార్లమెంట్​ లో భారత సంతతి మాజీ హోం సెక్రెటరీ ప్రీతి పటేల్​ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరు ఎంపీలు కూడా దాడులను ఖండించారు. 

బంగ్లాదేశ్​ కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ ఆపరేషన్ యాక్ట్ 2006 ప్రకారం భారతీయ టీవీ ఛానళ్ల ప్రసారాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హిందువులు, మైనార్టీలపై దాడులను ప్రసారం చేస్తూ నిజనిజాలను ప్రపంచానికి తెలియజెప్పే మీడియాను కూడా తాత్కాలిక ప్రభుత్వం కట్టడి చేయాలని భావిస్తుంది.