మోదీ అంటే పాక్​ కు దడ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా

Sep 21, 2024 - 13:25
 0
మోదీ అంటే పాక్​ కు దడ

శ్రీనగర్​: 90వ దశకంలో జమ్మూకశ్మీర్​ లో పరిస్థితులు ఏ విధంగా ఉండేవే తనకంటే బాగా ఇక్కడి ప్రజానీకానికే తెలుసని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. ప్రస్తుతం పాక్​ ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అగాధంలోకి వెళ్లిపోయిందని మోదీ అంటేనే జడుసుకుంటుందని అమిత్​ షా తెలిపారు. 

శనివారం జమ్మూకశ్మీర్​ లో రెండో దశ ఎన్నికల సందర్భంగా మెంధార్​ లో బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. రిజర్వేషన్లు అంతం చేస్తామని, ఆర్టికల్​ ను 370ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్​, ఎన్సీలు కలిసి మళ్లీ రాష్​ర్టాన్ని అగాధంలోకి నెట్టే ప్రయత్నాలను ప్రతీ ఒక్కరూ గమనించాలన్నారు. ఈ రెండు పార్టీలు ఉగ్రవాదులు, రాళ్లదాడులు, హింస వైపు రాష్ర్టాన్ని తీసుకువెళ్లాలనుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి వ్యాఖ్యలనే గాకుండా ఈ రెండు పార్టీలను రాష్ర్టంలో నామరూపాల్లేకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గుర్జర్​ బకర్వాల్​, పహారీలకు పదోన్నతులలో మోదీ నేతృత్వంలోని రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీరి ప్రభుత్వ హయాంలో పక్కదేశంతో కూడా భయపడేవారని వీరు రాష్​ర్టానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఎప్పుడూ హింసాయుత్మకంగానే రాష్​ర్టం ఉండేదన్నారు. కానీ తామొచ్చాక ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని శత్రువులకు మనమంటే భయపడేలా రుచి చూపించామన్నారు. రెండోవిడత ఎన్నికల్లో అత్యధిక ఓటర్లు పాల్గొని బీజేపీకి సంపూర్ణ మద్ధతు తెలపాలని తద్వారా రాష్ర్ట అభివృద్ధిని కాంక్షించాలని షా పిలుపునిచ్చారు.