రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్

Congress is cheating the farmers

Oct 20, 2024 - 18:45
 0
రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్

నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: ఎకరానికి 15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ తీరుని ఎండగడుతూ బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్  ఆదేశాల మేరకు, సంగారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్ఠిబొమ్మను మండల శ్రేణులు దగ్ధ చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకుల మోసపూరిత హామీలతో గద్దెనిక్కి అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.  రైతులపై మంత్రి తుమ్మల హాస్యాస్పదంగా మాట్లాడం సరికాదన్నారు. రైతు భరోసా ఎగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకు బీఆర్​ ఎస్​ సిద్ధంగా ఉందని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, కుమార్, సుదర్శన్ రెడ్డి, నరేష్, చందు, గౌస్, సందీప్, ఆశం, నరేష్, సందీప్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.