మూడు రెట్ల వేగంతో పనిచేస్తా

Works at three times the speed

Oct 20, 2024 - 18:20
 0
మూడు రెట్ల వేగంతో పనిచేస్తా
వారణాసిలో రూ 6,100 కోట్ల పనులకు 
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
సొంత నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటన
వారణాసికి అన్ని ప్రాజెక్టులు లభ్యం
ప్రాజెక్టులతో ఉపాధి కల్పన
వంద రోజులు పూర్తి రూ. 15 లక్షల కోట్ల అభివృద్ధి పనులు
వారణాసి: మరోసారి తనకు బనారస్​ వచ్చే అవకాశం కలగడం తన అదృష్టమన్నారు. కాశీ విశ్వేశ్వరనాథుని ఆశీర్వాదంతో వారణాసిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నాందీ పలికానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో ఆర్జే శంకర కంటి ఆసుపత్రిని ఆదివారం ప్రారంభించారు. ఈ పర్యటనలో రూ. 6,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వారణాసిలో మొత్తం 23 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 
 
ఆధునికతో భారత్​ ముందంజ..
విద్య, ఆటలు, పర్యటనలు, కేంద్ర పథకాల ద్వారా నిర్వహిస్తున్న ప్రాజెక్టులన్నీ వారణాసికి లభించాయ్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా నిరుద్యోగ యువతకు కొత్త అవకాశాలు, ఉద్యోగాల సృష్టి జరిగిందన్నారు. కొన్ని భాషలకు శాస్ర్తీయ భాషలకు స్థానం కల్పించామన్నారు. తనకు మూడోసారి సేవ చేసే అధికారం ఇచ్చినందుకు మూడు రెట్లు వేగంతో పనిచేస్తానని నిర్ణయించుకున్నానని మోదీ తెలిపారు. పదేళ్ల ముందు వరకు అవినీతి, అక్రమాల వార్తలే వినిపించేవన్నారు. కానీ నేడు వంద రోజులు పూర్తి చేసుకున్నాక రూ. 15 లక్షల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన చర్చ దేశవ్యాప్తంగా చర్చిస్తోందన్నారు. ప్రజల డబ్బు ప్రజల కోసమే నిజాయితీగా ఖర్చు పెట్టడమే తమ లక్ష్యమన్నారు. ఇన్​ ఫ్​రాస్ర్టక్చర్​  ద్వారా ప్రతిఒక్కరిని కలపాలని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బనారస్​ వచ్చే వారి సంఖ్య పెరగడంతో ఇక్కడి ప్రజలకు  లాభం చేకూరుతుందన్నారు. ఆధునికతలో నేడు భారత్​ పేరు ప్రపంచదేశాల్లో మారుమోగిపోతుందన్నారు. 
 
150 ఎయిర్​ పోర్టులు..
2014లో కేవలం 70 ఎయిర్​ పోర్టులుండేవన్నారు. ప్రస్తుతం 150 ఎయిర్​ పోర్టులున్నాయి అన్నారు. ప్రస్తుతం ఉన్నపాత ఎయిర్​ పోర్టులను కూడా పునరాభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు. ఈ రోజు యూపీ పేరు దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్​ర్టాలలో ఒకటిగా పేరొందిందన్నారు. 
 
అభివృద్ధి కార్యక్రమాలు..
ఖేలో ఇండియా, స్మార్ట్ సిటీ మిషన్ కింద రూ. 210 కోట్ల విలువైన వారణాసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ పునరాభివృద్ధికి సంబంధించిన 2,3 దశలను ప్రధాని ప్రారంభించారు. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ప్లేయర్స్ హాస్టల్స్, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, వివిధ క్రీడల కోసం ప్రాక్టీస్ ఫీల్డ్‌లు, ఇండోర్ షూటింగ్ రేంజ్‌లు, పోరాట స్పోర్ట్స్ అరేనాలతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సదుపాయాన్ని రూపొందించడం ప్రాజెక్ట్ లక్ష్యం. అదనంగా, రూ. 570 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆగ్రా ఎయిర్‌పోర్ట్‌లో న్యూ సివిల్ ఎన్‌క్లేవ్‌లకు, అలాగే దర్భంగా విమానాశ్రయానికి దాదాపు రూ. 910 కోట్లు, బాగ్‌డోగ్రా విమానాశ్రయానికి సుమారు రూ. 1,550 కోట్లతో శంకుస్థాపన చేశారు. రేవా విమానాశ్రయం, అంబికాపూర్‌ విమానాశ్రయంలో రూ. 220 కోట్ల విలువైన నతన టెర్మినల్ భవనాలను ప్రధాని ప్రారంభించారు.