ఎంపీకి షరతులతో కూడిన బెయిల్​

మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం జైలు నుంచి బయటకు వచ్చారు.

Apr 3, 2024 - 17:53
 0
ఎంపీకి షరతులతో కూడిన బెయిల్​

ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయనకు మంగళవారమే సుప్రీంకోర్టు బెయిల్​ను మంజూరు చేసినా, ఆర్డర్​ కాపీ రావడంలో ఆలస్యం ఏర్పడడంతో బెయిల్​ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. దీంతో బుధవారం ఉదయం రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్ సింగ్‌ తరఫు న్యాయవాది, భార్య అనితా సింగ్ లు ​కోర్టుకు సమర్పించారు. బెయిల్​ సందర్భంగా సుప్రీంకోర్టు సంజయ్​కు పలు షరతులను విధించింది. ఢిల్లీ ఎన్​సీఆర్​ దాటికి ఎక్కడికి వెళ్లకూడదని ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడితే ముందు కోర్టు అనుమతి తప్పనిసరని పేర్కొంది. పాస్​పోర్టును పోలీసులకు సమర్పించాలని సూచించింది. విచారణకు అందుబాటులో ఉండాలని పేర్కొంది. సాక్ష్యాలను తారుమారు చేస్తే సహించేది లేదని హెచ్చరించింది. ఆరోగ్య సమస్యల కారణంగా సంజయ్​ సింగ్​రెగ్యులర్​ చెకప్​ కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చెకప్​ అనంతరం ఆయనను కుటుంబ సభ్యులకు అప్పజెప్పనున్నారు.