డ్రగ్స్​ రహితంగా భారత్​

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా

Aug 25, 2024 - 20:36
 0
డ్రగ్స్​ రహితంగా భారత్​
రాయ్​ పూర్​: దేశాన్ని డ్రగ్స్​ రహితంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. ఆదివారం చత్తీస్​ ఘడ్​ లోని రాయ్​ పూర్​ లో నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో ప్రాంతీయ యూనిట్​ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రగ్స్​ నియంత్రణపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం విష్​ణుదేవ్​ సాయ్​, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్​ రాయ్​, డిప్యూటీ సీఎం విజయ్​ శర్మ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 
ప్రధాని మోదీ నేతృత్వంలో 2047 విజన్​ తో అభివృద్ధి భారత్​ దిశగా ముందుకు వెళుతున్నామన్నారు. ఈ సంకల్పంతో డ్రగ్స్​ ను పూర్తిగా కట్టడి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, మాదకద్రవ్యాలు వంటి చెడు ఘటనలు దేశ భద్రతకు భంగం వాటిల్లేలా చేస్తున్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థను బలహీన పరుస్తున్నాయని తెలిపారు. అందుకే జీరో టాలరెన్స్​ విధానంతో ప్రభుత్వం ముందుకు సాగాలని నిర్ణయించుకుందని అమిత్​ షా తెలిపారు. అనంతరం రాయ్​ పూర్​ లో ఏక్​ పేడ్​ మా కే నామ్​ మోదీ పిలుపు మేరకు మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరూ పర్యావరణ రక్షణకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.